
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. మే నెలకు షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు.. అందుకే గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.. ఇటీవల వైజాగా లో కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్న సినిమా ఇప్పుడు మరో షెడ్యూల్ షూటింగ్ ను మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.. ఈ మేరకు రామ్ చరణ్ రాజమహేంద్ర వరకు పయనమయినట్లు తెలుస్తుంది..
పొలిటికల్ డ్రామాగా తెరకేక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించునున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, నవీన్‌చంద్ర, ప్రియదర్శి, జయరాం, సునీల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ షూటింగ్ రాజమహేంద్రవరంలో జరగనుందని సమాచారం.. ఈ షెడ్యూల్ ఈ నెలాఖరులోప్రారంభం కానుందని తెలిసింది. కథరీత్యా సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట..
ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక మరో షెడ్యూల్ షూటింగ్ కోసం వైజాగ్ కు వెళ్ళనున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. రీసెంట్ గా జరగండి సాంగ్ ను రిలీజ్ చేశారు.. ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు..