Leading News Portal in Telugu

Balakrishna: మరోసారి అభిమానిపై చేయి చేసుకున్న బాలయ్య



Balakrishna Election Campaign

Balakrishna Beats his Fan at Election Campaign: నేటి నుంచి రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాలకృష్ణ స్వర్ణాంధ్ర బస్సు యాత్ర చేయనున్నారు. ఈ క్రమంలో కదిరి చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణకి సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బివి వెంకటరాముడు, కదిరి టిడిపి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే అభిమానుల పట్ల హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి దురుసుగా ప్రవర్తించిన వీడియో వెలుగులోకి వచ్చింది. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో శనివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించి బాలయ్య ఉదయం సత్యసాయి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ప్రయత్నించారు, అయితే ఈ క్రమంలో గుంపుగా ఒకేసారి మీద పడేందుకు యత్నించారు.

Thug Life: ఆఖరికి సిద్దార్థ్ కూడానా.. అసలు ఏం జరుగుతోంది భయ్యా?

ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన బాలయ్య.. మోచేతితో ఒక అభిమానిని కొట్టారు. గతంలో కూడా పలు మార్లు ఆయన అభిమానుల మీద చేయి చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల ముంగిట అభిమాని మీద చేయి చేసుకోవడం గమనార్హం. ఇక శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని హజరత్ ఆలం ఖాన్ వలి బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన నందమూరి బాలకృష్ణ అనంతరం కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకునున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశ్వీరాదం కూడా బాలయ్య అందుకున్నారు. ఇక వరుసగా మూడవ సాయి హిందూపురం ఎమ్మెల్యేగా టీడీపీ తరపున బాలయ్య పోటీ చేస్తున్నారు.