Leading News Portal in Telugu

Samantha : ఫహాద్ ఫాజిల్ “ఆవేశం” మూవీకి రివ్యూ ఇచ్చిన సమంత..



Whatsapp Image 2024 04 24 At 11.03.46 Am

ఈ ఏడాది మలయాళం సినిమాలు అదరగొడుతున్నాయి .అదిరిపోయే కంటెంట్ తో తెరకెక్కుతున్న మలయాళ సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈ ఏడాది మలయాళంలో తెరకెక్కిన మంజుమ్మేల్ బాయ్స్‌, ప్రేమలు, ది గోట్‌లైఫ్‌ వంటి సినిమాలు అద్భుత విజయం సాధించాయి.మలయాళంలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించాయి.ఇదిలా ఉంటే ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో మూవీగా “ఆవేశం” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన “ఆవేశం” మూవీ థియేటర్లలో వంద కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఫహాద్ ఫాజిల్ కెరీర్‌లో వందకోట్ల మైలురాయిని చేరుకున్నమొదటి మూవీగా ఆవేశం మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామా కథాంశంతో వచ్చిన ఈ మూవీని రొమాంచం ఫేమ్ జీతూ మాధవన్ తెరకెక్కించాడు.ఈ సినిమాలో రంగా అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ అద్భుతంగా నటించాడు తన బాడీలాంగ్వేజ్‌ మరియు కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి . ఇదిలా ఉంటే ఈ సూపర్ హిట్ మూవీకు స్టార్ హీరోయిన్ సమంత రివ్యూ ఇచ్చింది. ఆవేశం సినిమా అన్నిరకాల మ్యాడ్ నెస్ తో కూడుకున్నది .ఆ మ్యాడ్నెస్ నాకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమా అన్ని రూల్స్ ని బ్రేక్ చేసింది .ఒక సన్నివేశం నుండి మరో సన్నివేశానికి జానర్ లను మార్చారు.ఈ సినిమా చూసి నేను భయపడ్డాను మరియు నవ్వుతున్నాను.. కొన్ని సినిమాలను తప్పనిసరిగా థియేటర్స్ లో చూడాల్సిందే.అలాంటి సినిమాలలో ఆవేశం సినిమా ఒకటి ..ఈ సినిమాను కచ్చితంగా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలనీ సమంత కోరింది.