Leading News Portal in Telugu

Ramasahayam Raghuram Reddy : ఖమ్మం ఎంపీ అభ్యర్ధిగా విక్టరీ వెంకటేష్ వియ్యంకుడు..



Whatsapp Image 2024 04 25 At 8.47.33 Am

రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రస్తుత రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి పేరుని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు అలాగే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మహ్మద్ వలీవుల్లా సమీర్ పేర్లను కాంగ్రెస్ పార్టీని ప్రకటించింది.ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామసహాయం రఘురాంరెడ్డి ఎవరో కాదు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అయిన విక్టరీ వెంకటేష్ కు వియ్యంకుడు..అలాగే రఘురామరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా వియ్యంకుడే కావడం విశేషం.తన ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను, చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె సప్ని రెడ్డిని వివాహం చేసుకున్నారు.

రఘురామ రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి ఏకంగా నాలుగుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. దీంతో రఘురామరెడ్డికి రాజకీయ పలుకుబడి గట్టిగానే ఉంది.రఘురాం రెడ్డి 2011-2013లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ ) ప్యాటరన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వైస్ చైర్మన్ గా మరియు హైదరాబాద్ రేస్ క్లబ్ లో బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. రఘురాం రెడ్డితో పాటు వారి తాతముత్తాతలు సేవాదృక్పథ కుటుంబానికి చెందిన వారు.దీనితో కాంగ్రెస్ పార్టీ ఆయనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తుంది.కాగా ఏకంగా ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఖమ్మం సీటును ఆలస్యంగా ప్రకటించినా ఏమీ కాదనే ఉద్దేశ్యంతో పార్టీ ఈ సీటు అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ కాస్త ఆలస్యం చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి .