
Rashmi Comments on Anasuya Bharadwaj: జబర్దస్త్ అనగానే హాట్ యాంకర్లు గుర్తు రావడం చాలా సర్వసాధారణం. గతంలో అనసూయ తరువాత రష్మీ ఆ తర్వాత సౌమ్య శారద ఇప్పుడు సిరి హనుమంతు వంటి వాళ్ళు కనిపిస్తూ కనువిందు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ అందరిలో రష్మీ అనసూయ ఇద్దరికీ లభించిన క్రేజ్ మరెవరికి లభించలేదని చెప్పాలి. నిజానికి అందరి కంటే ముందు అనసూయ జబర్దస్త్ లో కనిపించింది. ఆ తర్వాత ఆమె గ్యాప్ తీసుకుందో లేక నిర్వాహకులు గ్యాప్ ఇచ్చారో తెలియదు కానీ ఆ సమయంలో రష్మీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో అనసూయని తప్పించి రష్మిని పెట్టారనే ప్రచారం జరగడంతో ట్రోల్స్ కూడా నడిచాయి. అయితే ఈ అంశం మీద తాజాగా రష్మీ స్పందించింది.
Raashi Khanna: రాశీ ఖన్నా దారుణం.. శ్రీనివాస్ అవసరాల సంచలన వ్యాఖ్యలు
అప్పట్లో నాకు సంబంధం లేని విషయం మీద నన్ను ట్రోల్ చేశారు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకపోవడంతో సైలెంట్ గా ఉన్నా, నన్ను అప్పట్లో దారుణంగా తిట్టారని ఆమె చెప్పుకొచ్చింది. రష్మీ నువ్వు అనసూయ ప్లేస్ ఎందుకు ఆక్రమించావు అని అడిగితే దానికి ఆమె ఆక్రమించుకోవడం ఏంటి లాగేసుకున్నానంటూ సమాధానం ఇచ్చింది. మరోసారి యాంకర్ అనసూయ పక్కకి పంపి నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే అనసూయ చిన్నపిల్లా ఏంటి? పక్కకు పంపడానికి అంటూ రష్మీ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతానికి రష్మి జబర్దస్త్ తో పాటు మల్లెమాల నిర్వహించే పలు షోలకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తూ వస్తోంది. గుంటూరు టాకీస్ సినిమాలో కాస్త హాట్ పాత్రలో కనిపించిన ఆమె తర్వాత ఎందుకు అలాంటి పాత్రలకు కొంచెం దూరం మైంటైన్ చేస్తూ వస్తోంది. ఇక తాజాగా అనసూయ గురించి లక్ష్మీ చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.