
Avasarala Srinivas Comments on Raashi Khanna Driving: నార్త్ భామ రాశి ఖన్నా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు ఒకరకంగా స్టార్ హీరోలు అందరితో నటించి మంచి క్రేజ్ అయితే సంపాదించింది. ఇక్కడ ప్రస్తుతం ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు, దీంతో బాలీవుడ్ వెళ్లి అక్కడే వరుస సినిమాలు చేస్తోంది. అప్పుడప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో కూడా ఆమె దర్శనం ఇస్తోంది. అయితే తాజాగా తెలుగు సినీ పరిశ్రమకు ఆమెను పరిచయం చేసిన నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఆమె గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాశి ఖన్నా కారు డ్రైవింగ్ గురించి కామెంట్ చేశాడు.
Aamani: భర్తతో విడిపోవడానికి కారణం ఇదే.. విడాకుల వెనక కారణం చెప్పిన ఆమని
రాశి ఖన్నా కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేనా కారులో కూర్చోను, ఎందుకంటే ఆమె డ్రైవింగ్ అంటే తనకి చాలా భయం అని చెప్పుకొచ్చారు. రాశి ఖన్నా స్టంట్ మాస్టర్ కంటే దారుణంగా డ్రైవింగ్ చేస్తుంది, ఆమె డ్రైవ్ చేస్తున్న కారు ఒకే ఒక్కసారి ఎక్కాను మళ్ళీ నా వల్ల కాదు అని ఇంకా ఎప్పుడు ఎక్కలేదు. ఆ రోజే రాశి ఖన్నా కారు కనుక డ్రైవ్ చేస్తే తాను ఎక్కకూడదు అనే నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి హీరోలలో ఎన్టీఆర్ డ్రైవింగ్ కూడా అంతే ర్యాష్ గా ఉంటుందని ఆయన కారు ఎక్కిన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇప్పుడు రాశి ఖన్నా గురించి అవసరాల శ్రీనివాస్ అదే విధమైన కామెంట్లు చేయడం గమనార్హం. అయితే ఈ విషయం మీద రాశి ఖన్నా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి దర్శకత్వానికి బ్రేకు లేసిన అవసరాల శ్రీనివాస్ వరుస పాత్రలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. త్వరలోనే ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టుకునే అవకాశం కూడా ఉంది.