Leading News Portal in Telugu

Jason Sanjay: విజయ్ కొడుక్కి శంకర్ ఫ్యామిలీతో ఏం పని?



Jason Sanjay

Jason Sanjay in Shankar Daughters Family Pic: ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య రెండో వివాహం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు ఇండియన్ సినీ ప్రముఖులు చాలా మంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సంగీత కార్యక్రమంలో ప్రముఖ హిందీ నటుడు, దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్ సింగ్, దర్శకుడు అట్లీ, శంకర్ రెండో కూతురు అదితి శంకర్ అలరించారు. ఇక వీరి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళ, తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు, దర్శకులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఈ వేడుకలు పూర్తయిన నేపథ్యంలో శంకర్‌ అండ్‌ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ప్రత్యేకంగా ఫోటో షూట్‌ను నిర్వహించారు.

Samantha Vs Sobhita: ఇదేంటి సోషల్ మీడియాలో ఇంత డైరెక్టుగానా?

ఈ ఫోటోలను నిన్న అదితి శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. అయితే అంతా బాగానే ఉంది కానీ వాటిలో ఒక ఫోటోలో నటుడు విజయ్ కుమారుడు సంజయ్ కూడా ఉన్నాడు. ఇక ఈ దెబ్బకి ఈ ఫోటోలు సోషల్ మీడియా సైట్లలో వేగంగా వైరల్ అయ్యాయి. అసలు విజయ్ కొడుక్కి శంకర్ ఫ్యామిలీ ఫొటోలలో పనేమిటి? అనే చర్చలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు లైకా సంస్థ సంజయ్ డైరెక్టర్ గా నిర్మించిన సినిమాలో అదితి శంకర్ నటించబోతుండటం గమనార్హం. ఇక విజయ్ ఒక పక్క రాజకీయాల్లో బిజీ అవుతూ సినిమాలు వదిలేయడానికి సిద్ధం అవుతున్న సమయంలో ఆయన కుమారుడు డైరెక్టర్ అయ్యేందుకు సిద్ధం అవుతూ ఉండడం గమనార్హం.