Leading News Portal in Telugu

Megastar Chiranjeevi : రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి


Megastar Chiranjeevi : రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి

President Droupadi Murmu confers Padma Vibhushan to Konidela Chiranjeevi:ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. పద్మ అవార్డులు – దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ముఖ్యమైనవిగా చెబుతూ ఉంటారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ మరియు ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు మరియు పౌర సేవతో సహా వివిధ విభాగాలు, రంగాలలో పాటు పడిన వారికి ఈ అవార్డులు ఇవ్వబడతాయి.


Bengaluru: ప్యూరిఫైయర్ సర్వీస్ కోసం వచ్చి మహిళా టెక్కీపై లైంగిక వేధింపులు

ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. గత నెల, ఏప్రిల్ 22న రాష్ట్రపతి మూడు పద్మవిభూషణ్, ఎనిమిది పద్మభూషణ్ మరియు 55 పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. ఇప్పుడు ఈరోజు మిగతా వారికి ప్రధానం చేశారు. ఇక ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అలియాస్ కొణిదెల శివశంకర వర ప్రసాద్ కి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్ పురస్కారం అందచేశారు. ఇక ఈ వేడుక‌లో చిరంజీవి భార్య సురేఖ‌తో పాటు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్, కోడ‌లు ఉప‌సాన కూడా పాల్గొన్నారు. ఇక ద్రౌపది ముర్ము పురస్కారం ప్రధానం చేస్తున్న వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది.