Leading News Portal in Telugu

Pavitra : సీరియల్ లవర్స్ కి షాకింగ్ న్యూస్.. ప్రముఖ నటి దుర్మరణం


Pavitra : సీరియల్ లవర్స్ కి షాకింగ్ న్యూస్.. ప్రముఖ నటి దుర్మరణం

తెలుగు సీరియల్ యాక్టర్ పవిత్ర జయరాం మృతి చెందారు.మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరామ్ మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో పవిత్ర అక్కడిక్కడే మరణించారు.కర్ణాటకలోని తన సొంత వూరుకి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా తన కారు అదుపుతప్పి డివైడర్‏ను ఢీకొట్టి.. కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు సమాచారం.


ఆమెతోపాటు కారులో తన తోటి నటులు మరియు కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారంఈ ఘటనలో ఆమె బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్ మరియు నటుడు చంద్రకాంత్ కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.