Leading News Portal in Telugu

Balakrishna : పాన్ ఇండియా రేంజ్ లో బాలయ్య ‘అఖండ2’..?


Balakrishna : పాన్ ఇండియా రేంజ్ లో బాలయ్య ‘అఖండ2’..?

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను “NBK109 “వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


అయితే ఇటీవల రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బాలయ్య సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ప్రచారంలో పాల్గొన్నారు.తాజాగా ఎన్నికలు ముగియడంతో బాలయ్య మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నారు.ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.అలాగే బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయినట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.అఖండ 2 సినిమాను 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.