Leading News Portal in Telugu

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురి రిక్వెస్ట్..


Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురి రిక్వెస్ట్..

సీరియల్‌ నటుడు చందు బలవన్మరణంతో సరికొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. నటుడు చందు, నటి పవిత్ర జయరాం పెళ్లి చేసుకున్నారని ఇన్నిరోజులు అంతా భావించారు. కానీ., వారిద్దరిది వివాహేతర సంబంధమని తెలిసింది. గడిచిన ఆరేళ్లుగా చందుతో పవిత్ర జయరాం రిలేషన్‌ లో ఉన్నాడని చందు భార్య శిల్ప అసలు విషయాన్ని బయటపెట్టింది.


Read also: Mirai: రాకింగ్ స్టార్ రీఎంట్రీ కన్ఫర్మ్.. గెట్ రెడీ..

ఇక ఈ విషయం వైరల్‌గా మారడంతో పవిత్ర జయరాం కూతురు ప్రతీక్ష కూడా తాజాగా స్పందించింది. చందు, పవిత్ర జయరాంల బంధం గురించి తప్పుగా మాట్లాడవద్దని ప్రతీక్ష రిక్వెస్ట్‌ చేస్తుంది. ముందు వాళ్లిద్దరూ మంచి స్నేహితులని స్పష్టం చేసింది. చందు కూడా తనతో తరచూ ఫోన్‌ లో టచ్ లో ఉండేవారని.. ఆయన ఎప్పుడు చదువుకోవాలని ఎంతగానో ప్రోత్సహించే వారని చెప్పుకొచ్చింది.

వాళ్ల అమ్మ అంత్యక్రియలకు కూడా చందు వచ్చారని ఈ సందర్బంగా ఆమె చెప్పింది. మరోవైపు, పవిత్ర జయరాంతో చందు ఆరేళ్లుగా రిలేషన్‌ లో ఉన్నాడని చందు భార్య శిల్ప తెలిపింది. త్రినయిని సీరియల్‌ ప్రాజెక్టు వచ్చినప్పటి నుండి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందని శిల్ప తెలిపింది.