Leading News Portal in Telugu

Sudheer Babu : మహేష్ తో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..


Sudheer Babu : మహేష్ తో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..

Sudheer Babu : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా సుధీర్ బాబు ఎస్ఎంఎస్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమాతో నటుడుగా సుధీర్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తరువాత సుధీర్ బాబు నటించిన “ప్రేమ కథా చిత్రం” సూపర్ హిట్ అయింది.హారర్ కామెడీ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ చిత్రంతోనే సుధీర్ బాబు సూపర్ హిట్ అందుకున్నారు.అయితే సుధీర్ బాబు ఆ తరువాత చేసిన సినిమాలు ఏవి కూడా అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఈ హీరో “హరోం హర” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో ‘హరోం హర’ను దర్శకుడు జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించారు.ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌ గా నటించింది.అలాగే ఈ సినిమాలో సునీల్‌ కీలకపాత్ర పోషించారు. ఈ నెల 31న ‘హరోం హర ‘ సినిమా విడుదల కానుంది.


తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు ఆసక్తిర వ్యాఖ్యలు చేసారు.మీ కెరీర్ లో అంచనాలు తప్పిన సినిమా ఏది అని ప్రశ్నించగా ”ప్రేమకథా చిత్రమ్‌’ తప్ప తాను చేసిన అన్ని సినిమాల ఫలితాల విషయంలోతాను ఎంతగానో నిరుత్సాహపడినట్లు సుధీర్ బాబు తెలిపారు. నా చిత్రాలను ప్రేక్షకులకు చేరువ చేయడంలో నేను ఫెయిల్‌ అయ్యానేమో అనిపించిందని సుధీర్ బాబు తెలిపారు. నేను నటించిన కొన్ని సినిమాలు టెక్నికల్‌గా బాగున్నా ఆశించిన ఫలితం ఇవ్వలేదు” అని సుధీర్ బాబు తెలిపారు.అలాగే మహేష్ బాబుతో మల్టీస్టారర్ మూవీ ఎప్పుడు చేస్తారు అని అడగగా అందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సుధీర్ బాబు తెలిపారు. మల్టీస్టారర్‌ గురించి తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదు.అది సాధ్య పడితే త్వరలోనే ఆ సినిమా మొదలవుతుంది అని సుధీర్ బాబు తెలిపారు .