Leading News Portal in Telugu

Pushpa 2 : పుష్ప రాజ్ ఆ టార్గెట్ రీచ్ అవుతాడా..?


Pushpa 2 : పుష్ప రాజ్ ఆ టార్గెట్ రీచ్ అవుతాడా..?

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప2”.బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్పకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది .మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా  తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్సె వీడియో ,టీజర్ ,సాంగ్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన లభించింది.ఈ సినిమాలో పుష్ప రాజ్ మాస్ స్టెప్స్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసాయి.ఈ సినిమాను మేకర్స్ “ఆగస్టు 15 ” న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ సినిమా రిలీజ్ కు ఇంకా 90 రోజులు మాత్రమే మిగిలి వుంది.


అయితే ఈ సినిమా రిలీజ్ లో ఎలాంటి మార్పు ఉండదు అంటూ మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో ఈ మూవీకి పోటీగా ఏ సినిమాను కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేయడం లేదు.అయితే పుష్ప 2 లో నటుడు ఫహద్ ఫాజిల్ ,అల్లుఅర్జున్ మధ్య కొన్ని కీలక సీన్స్,ఐటెం సాంగ్ వంటివి బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం.దీనితో ఈ పుష్ప రాజ్ ఈ 90 రోజుల టార్గెట్ రీచ్ అవుతాడా అని సందేహం మొదలైంది.అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శర వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.అలాగే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జులై నెల చివరకు పూర్తి చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.ఎట్టి పరిస్థితిలో ఈ సినిమాను అనుకున్న తేదీనే విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.