
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ ను ఇటీవల మేకర్స్ రివీల్ చేసారు.కల్కి సినిమాలో ప్రభాస్ మిత్రునిగా ఓ కారు ఉంటుందని మేకర్స్ తెలిపారు.ఆ కారు పేరు “బుజ్జి” అని మేకర్స్ రివీల్ చేసారు.ఈ సినిమాలో బుజ్జి పాత్ర ఎంతో సరదాగా ఉంటుందని సమాచారం.అయితే బుజ్జి పాత్రకు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఇదిలా ఉంటే తాజాగా మే 22 న బుజ్జి ని పరిచయం చేస్తున్నట్లు మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.తాజాగా బుజ్జి పరిచయ వేదికకు సర్వం సిద్ధం అయింది.సాయంత్రం 5 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈవెంట్ ప్రారంభమవనుంది.అయితే ఎగిరే కారులో ప్రభాస్ స్పెషల్ ఎంట్రీ ఉంటుందని సమాచారం.ఈ ఈవెంట్ కు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హోస్ట్ గా ఉండనున్నట్లు సమాచారం.ఈ ఈవెంట్ లో స్పెషల్ బైక్ స్టంట్ షో ఉండనున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం బైకర్స్ స్టంట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది.
Yes, Bhairava!
The day has come to finally see everyone 😉 #Bujji #Kalki2898AD pic.twitter.com/UetPRqnnRz— Bujji (@BelikeBujji) May 21, 2024