
Samyuktha Menon Bollywood Debut almost fixed: చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. ఈ మలయాళ భామ మలయాళంలో అనేక సూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది. తెలుగులోకి వచ్చిన తర్వాత చేసిన దాదాపు చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఆమె మరొక స్టెప్ ముందుకేసేందుకు సిద్ధమైంది అదేనండి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వాస్తవానికి బాలీవుడ్ లో అడుగు పెట్టాలనే కోరిక ప్రతి సౌత్ హీరోయిన్ కు ఉంటుంది. అందుకే మన సౌత్ హీరోయిన్స్ అంతా హిందీలోని స్టార్ హీరోలతో సినిమా చేయాలని కోరుకుంటారు. అయితే దీనికి భిన్నంగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు స్టార్ హీరోయిన్ సంయుక్త రెడీ అయింది.
Botsa Satyanarayana: మే 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం.. మంత్రి బొత్సా వెల్లడి
అదేమంటే ఆమె ఫస్ట్ హిందీ మూవీ స్టార్ బేస్డ్ కాదు, కంటెండ్ బేస్డ్ గా ఉండబోతోంది. ఈ సినిమాలో పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో సంయుక్త నటించనుందని టాక్ వినిపిస్తోంది. కాజోల్, ప్రభుదేవా, నసీరుద్దీన్ షా కీ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు దర్శకుడు చరణ్ తేజ్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ కూడా చేయనున్నారు. తెలుగులో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సంయుక్త ప్రస్తుతం నిఖిల్ సరసన పాన్ ఇండియా మూవీ స్వయంభుతో పాటు శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. అందరి కంటే భిన్నంగా బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అయిన సంయుక్తా మీనన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది కాలమే నిర్ణయించాలి.