Leading News Portal in Telugu

Item Songs: సీజన్‌ మొదలైంది.. ఐటెం గర్ల్స్ మాత్రం దొరకడం లే!


Item Songs: సీజన్‌ మొదలైంది..  ఐటెం గర్ల్స్ మాత్రం దొరకడం లే!

Upcoming crazy Movies Item Song Details: మరోసారి ఐటంసాంగ్స్‌ సీజన్‌ మొదలైంది.చాలా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో స్పెషల్‌ సాంగ్స్ హాట్‌ టాపిక్‌గా మారినా.. ఐటంగర్ల్స్ మాత్రం దొరకడం లేదు. ఎంతో మందిని అనుకుంటున్నా ఒక్కరూ సెట్ అవడం లేదు. అప్‌ కమింగ్‌ మూవీస్‌లో స్పెషల్‌ సాంగ్స్‌పై ఓ లుక్కేద్దాం.తెలుగు సినిమాలకు హీరోయిన్స్‌ దొరికినా.. ఐటంగర్ల్స్‌ దొరకడం లేదా? అని అడిగితే అవుననే సమాధానం వస్తుంది. హీరోయిన్స్‌ కంటే ఎక్కువగా ఐటంగర్ల్స్‌ కోసమే ఎక్కవ సెర్చింగ్‌ చేస్తున్నా చివరి దాకా సెట్‌ కావడం లేదు. మోస్ట్ అవైటెడ్ సినిమాగా చెబుతున్న పుష్ప 2లో ఐటంగర్ల్‌ ఎవరు? అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. రోజుకో పేరు తెరమీదకు వస్తోంది. సమంత.. జాన్వి.. దిశా పఠానీ అంటూ సాగిన ప్రచారంలోకి లేటెస్ట్‌గా యానిమల్‌ ఫేం త్రుప్తి దిమ్రి పేరు కూడా వచ్చి చేరింది.


Tollywood: సెట్స్ మీదకెళ్ళి మూడేళ్లు.. ఇంకెప్పుడు ఈ సినిమాలకు మోక్షం?

పుష్పను మించి పుష్ప2 ఐటంసాంగ్‌ వుండాలన్న పట్టుదలతో సుక్కు ఉండడంతో ఎప్పటికప్పుడు లెక్కలు మారిపోతున్నాయి. దీంతో చివరికి ఎవరితో చేయిస్తారో చూడాలి. ఇక మరోపక్క దేవరలో పూజా హెగ్డే ఐటంసాంగ్‌? చేస్తున్నట్టు ప్రచారం జరుగుతూ ఉండగా సలార్‌2 స్పెషల్‌ సాంగ్‌లో కియారా? అని విజయ్‌ ‘గోట్’లో ఐటంసాంగ్‌ కోసం శ్రీలీలను సంప్రదిస్తే.. రిజక్ట్ చేసిందంటూ వార్తలు వస్తున్నాయి. తమిళంలోకి ఐటంగర్ల్‌గా ఎంట్రీ ఇవ్వకూడదని ఆమె ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే పూజకు వరుస ఫ్లాపులు పూజా హెగ్డే ఇబ్బంది పెట్టాయి. హిందీలో అరకొర ఛాన్సులున్నా.. తెలుగులో ఒక్క సినిమా రాలేదు. ఎఫ్‌3లో ఐటంసాంగ్‌ తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది. లేటెస్ట్‌గా పూజాకు మరో ఐటం ఆఫర్‌ వచ్చిందా? లేదా అనేది తెలియాలంటే వాచ్‌ దిస్‌ స్టోరీ