Leading News Portal in Telugu

Gangs of Godavari : విశ్వక్ సేన్ మూవీకి న్యూయార్క్ లో క్రేజ్ మాములుగా లేదుగా..


Gangs of Godavari : విశ్వక్ సేన్ మూవీకి న్యూయార్క్ లో క్రేజ్ మాములుగా లేదుగా..

Gangs of Godavari : మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఛల్ మోహన్ రంగ మూవీ ఫేం కృష్ణ చైతన్య ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాను మేకర్స్ మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.


రీసెంట్ గా మేకర్స్ ఈ చిత్రం నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.విశ్వక్ సేన్ మాస్ డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇదిలా ఉంటే .. న్యూయార్క్‌లోని పాపులర్‌ టైమ్‌ స్క్వేర్స్‌లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్‌ స్క్రీనింగ్ అవుతోంది. యూఎస్‌ఏలో ఈ చిత్రాన్ని కాగ్నియెర్‌ సినీ క్రియేషన్స్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తుంది.ఇదిలా ఉంటే మే 28న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సమాచారం.ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా నట సింహం నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నట్లు సమాచారం..అయితే ఈ ఈవెంట్ కు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి వుంది .