
Senior Journalist Emotional Words on Chiranjeevi: తెలుగు సీనియర్ సినీ జర్నలిస్టు ప్రభు అనారోగ్యానికి గురవడంతో చిరంజీవి వెంటనే స్పందించడం పట్ల మీడియా వర్గాల్లో ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభు స్పందించారు. గత మూడు రోజులుగా నా ఆరోగ్యం పట్ల ఆందోళనను, నాపట్ల అభిమానాన్ని వ్యక్తం చేస్తూ మెసేజ్ లు పెట్టిన, పెడుతున్న సాటి పాత్రికేయ మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే హాస్పిటల్ కు వచ్చి నన్ను పరామర్శించిన పెద్దలు మురళీ మోహన్ గారికి, హీరో శ్రీకాంత్ గారికి , తమ్ముడు ఉత్తేజ్ కి, ఇంటికి వచ్చి పరామర్శించిన పాత్రికేయ మిత్రులు, ఫోన్ కాల్ ద్వారా, మెసేజ్ ల ద్వారా నన్ను పరామర్శించిన చలనచిత్ర ప్రముఖులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రస్తుతం స్లోగా రికవర్ అవుతున్నాను. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లేదు . పది రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు, కుటుంబ సభ్యులు ఒత్తిడి పెట్టడం వల్ల బయటకు రాలేకపోతున్నాను.
Sudheer Babu Wife: ఇప్పుడిలా ఉన్న మహేష్ బాబు చెల్లి.. అప్పుడు ఇలా ఉండేదా..?
విషయం తెలిసిన వెంటనే చిరంజీవి గారు అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడం వల్లనే నేను ఆపరేషన్ కు వెళ్లాను… లేదంటే తర్వాత చూసుకుందాంలే అన్న చిన్న నిర్లక్ష్యం ఉండేది… కానీ ఆయన చూపించిన కన్సర్న్ వల్లనే ఇదంతా జరిగింది. కేవలం సెకండ్ ఒపీనియన్ కోసం ఒక మంచి డాక్టర్ని సజెస్ట్ చేస్తారేమో అని మాత్రమే ఆయనకు మెసేజ్ పెట్టడం జరిగింది.. కానీ ఆయన అంతా తానై నన్ను పరుగులు పెట్టించి నా హెల్త్ ఇష్యూకు శుభం కార్డు వేశారు. ఒక్క నా విషయంలోనే కాదు… మన పాత్రికేయ కుటుంబం పట్ల చిరంజీవి గారు చూపించే శ్రద్ధ గురించి నేను కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. కరోనా కష్ట కాలంలో చిత్ర పరిశ్రమకు అందిన ప్రతి సహాయం పాత్రికేయ కుటుంబాలకు కూడా అందాలని చిరంజీవి గారు తీసుకున్న శ్రద్ధ, చూపించిన చొరవ అందరికీ గుర్తుండే ఉంటాయని ఆయన అన్నారు.