Leading News Portal in Telugu

Dangal Actress Zaira Wasim : దంగల్ నటి ఇంట తీవ్ర విషాదం


Dangal Actress Zaira Wasim : దంగల్ నటి ఇంట తీవ్ర విషాదం

Dangal Actress Zaira Wasim Father Passes Away : అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమాలో నటించిన జైరా వసీం తండ్రి కన్నుమూశారు. ఈ బ్యాడ్ న్యూస్ ను ఆ నటి స్వయంగా అభిమానులతో పంచుకుంది. తన తండ్రి స్వర్గానికి వెళ్లాలని ప్రార్థనలు చేయమని కూడా ఆమె అభ్యర్థించింది. ఇక ఈ విషయాన్ని జైరా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులకు తెలియజేసింది. ‘నా తండ్రి జాహిద్ వాసిమ్ ఈ లోకాన్ని విడిచి పెట్టారు. మీ ప్రార్థనలలో ఆయనను స్మరించుకోవాలని, ఆయన క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్దిన్చాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. అల్లా వారి పాపాలను క్షమించమని ప్రార్థించండి. వారి సమాధిని ఓదార్పు స్థలంగా చేసి శిక్ష నుండి వారిని రక్షించండి. వారిని ఆ లోకంలో హాయిగా జీవించనివ్వండి. వారికి స్వర్గంలో ఉన్నత స్థానం ఇవ్వండని అంటూ ఆమె రాసుకొచ్చింది. జైరా వసీం దంగల్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ ‘దంగల్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.


Vadivelu: వడివేలు కామెడీ.. కోమా నుంచి బయటపడ్డ బాలిక!!

సినిమాలో ఆమె చిన్ననాటి రెజ్లర్ గీతా ఫోగట్ పాత్రలో నటించింది. ఈ సినిమా తర్వాత అమీర్‌ఖాన్‌తో ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ చిత్రంలో కూడా నటించింది. ఇక ‘దంగల్’ చిత్రానికి గానూ జైరా వాసిమ్ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. 2019 సంవత్సరంలో, జైరా ప్రియాంక చోప్రా మరియు ఫర్హాన్ అక్తర్‌లతో కలిసి ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రంలో కూడా ఆమె కనిపించింది. అయితే ‘ది స్కై ఈజ్ పింక్’ జైరా వాసిమ్ నటించిన చివరి చిత్రం. జూన్ 2019 లో, జైరా నటనకి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నివసిస్తున్న జైరా వాసిమ్, తన నటనా జీవితం తన మతం మరియు విశ్వాసానికి దారితీస్తుందని పేర్కొంది. ఆ తరువాత, నవంబర్ 2020 లో, జైరా తన కొత్త జీవితాన్ని ప్రారంభించినందున సోషల్ మీడియా నుండి కూడా తన చిత్రాలను తొలగించమని అభిమానులను అభ్యర్థించింది.