Leading News Portal in Telugu

Miss Vizag : భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న నటుడు.. అడ్డంగా బుక్ చేసేసిందిగా!


Miss Vizag : భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న నటుడు.. అడ్డంగా బుక్ చేసేసిందిగా!

Miss Vizag Nakshatra Caught Her Husband with Second Wife: ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు అనేకం తెర మీదకు వస్తున్నాయి. నటీనటులు కూడా పెళ్లై పిల్లలు ఉన్నా ఈ అక్రమ సంబంధాల జోలికి పోకుండా ఉండలేక పోతున్నారు. తాజాగా ఓ నటుడు కూడా భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సంబంధం పెట్టుకుని ఆపై ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే నిజం ఎంతో కాలం దాగదు కదా ఎలాగో ఈ విషయం మిస్ వైజాగ్ కి తెలిసింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న భార్య తన భర్త తనకు కావాలంటూ ఆందోళనకు దిగింది. ఆమె మిస్ వైజాగ్ నక్షత్ర. విడాకులు ఇవ్వకుండానే తనను వదిలేసి వేరొక మహిళతో భర్త కాపురం చేస్తుండటంపై నక్షత్ర తాజాగా నిరసనకు దిగింది.


Gayathri Gupta-Baby: బేబీ సినిమాలో నేనే హీరోయిన్.. గాయత్రి గుప్తా సంచలన కామెంట్స్!

తన భర్త తనకి కావాలంటూ ఆందోళన చేసింది నక్షత్ర. ఊహించని విధంగా నక్షత్ర నిరసనకు దిగడంతో ఆమె భర్త తేజ షాక్ అయ్యాడు. 2013లో ఓ సినిమా షూటింగ్‌లో నక్షత్ర, తేజలకు పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ 2017లో వివాహం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఏమైందో ఏమో కానీ తేజ భార్యకు విడాకులు ఇవ్వకుండానే వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని నక్షత్ర మీడియా ముందుకు వచ్చింది. అంతేకాదు ఈ మేరకు నిరసనకు కూడా దిగింది. ఇక ఈ అంశం మీద పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది.