Leading News Portal in Telugu

Nikhil Swayambhu: ‘స్వయంభూ’ కోసం రంగంలోకి సెంథిల్ కుమార్..


Nikhil Swayambhu: ‘స్వయంభూ’ కోసం రంగంలోకి సెంథిల్ కుమార్..

బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అనేక పెద్ద చిత్రాల వెనుక మాస్టర్ సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్.. హీరో నిఖిల్ నటిస్తిన్న పాన్ ఇండియన్ స్వయంభూ కోసం బోర్డులోకి వచ్చారు. మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చూపిన విధంగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ లో టాప్ టెక్నీషియన్ ఇప్పటికే బృందంతో చేరారు అంటూ చిత్ర బృందం తెలిపింది.


Maname: ఏంటి భయ్యా.. ఒక్క సినిమాలో 16 పాటలు..

నిఖిల్, సెంథిల్ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణ. మేకింగ్ వీడియో గ్రాండ్ మేకింగ్‌ ని ఉండేలా కనపుడుతోంది. ఇందుకోసం సినిమా టీమ్ చాలా పెద్ద సెట్‌లు వేస్తోంది. ఇప్పటి వరకు నిఖిల్ నటించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘స్వయంభూ’. కెకె సెంథిల్ కెమెరా పని చేయడంతో., సినిమా విజువల్స్ టాప్ నాచ్‌ గా ఉండబోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

Gam Gam Ganesha: మొదటిరోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన గం గం గణేశా.. లెక్కలు ఇలా..

శనివారం తెల్లవారుజామున, మూవీ మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ ను విడుదల చేసారు. నిఖిల్ రెండు చేతుల్లో రెండు కత్తులతో యుద్ధంలో పోరాడుతున్న ఓ పురాణ యోధుడిగా కనపడ్డాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిఖిల్ యొక్క 20వ చిత్రం. సంయుక్త, నభా నటేష్ లు చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు.