Leading News Portal in Telugu

Ram Charan – Upasana Wedding Anniversary :12 వసంతాలు పూర్తి చేసుకున్న రామ్ చరణ్ దంపతులు, ఫోటో వైరల్


Ram Charan – Upasana Wedding Anniversary :12 వసంతాలు పూర్తి చేసుకున్న రామ్ చరణ్ దంపతులు, ఫోటో వైరల్

నిన్నటితో (జూన్ 14) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, భార్య ఉపాసన తమ వైవాహిక బంధం లో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఉపాసన సోషల్ మీడియా వేదికగా “12 ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్” అంటూ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో రామ్ చరణ్ తేజ్, ఉపాసన కలిసి తమ కూతురు క్లింకారా చేతులు పట్టుకున్నారు. ఈ ఫోటోలో కూడా క్లింకారా మొఖం కనపడకుండా వెనుక నుండి ఫోటో తీసి పోస్ట్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే మెగా అభిమానులు క్లింకారాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు.


తమకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఉపాసన. రామ్ చరణ్ కూడా ఉపాసన పోస్టుకి “ఉప్సి ఐ ఎంజాయ్ బీయింగ్ యువర్ బెటర్ హాఫ్” అంటూ రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు సోషల్ మీడియా లో వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ ఛేంజర్” సినిమాలో నటిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.