Leading News Portal in Telugu

Anjaamai: నటుడు విధార్థ్, వాణి భోజన్‌లను అరెస్ట్ చేయాలి.. కలకలం రేపుతున్న సినిమా వివాదం


Anjaamai: నటుడు విధార్థ్, వాణి భోజన్‌లను అరెస్ట్ చేయాలి.. కలకలం రేపుతున్న సినిమా వివాదం

Complaint Raised Against Anjaamai Movie Crew: అంజామై సినిమాలో నటించిన నటులు విధార్థ్, వాణి భోజన్‌లను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. నటుడు విధార్థ్ నటించిన అంజామై సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విధార్థ్ సరసన నటి వాణీ భోజన్ నటించింది. దర్శకుడు ఎస్.బి. సుబ్బురామన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నీట్ పరీక్షను నెగిటివ్ గా హైలైట్ చేయడానికి రూపొందించబడిందని అంటున్నారు. తమిళనాడులో నీట్‌ పరీక్షల కారణంగా చాలా మంది ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. ఈ దశలో నీట్ అవసరమా? పేద విద్యార్థులు ఎలా నష్టపోతారు అనే లైన్ తో అంజామై చిత్రాన్ని రూపొందించారు.


OMG : నవ్విస్తూ భయపెడుతున్న ఓ మంచి దెయ్య్యం

ఈ సినిమాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో ఇప్పుడు అంజామై సినిమాపై పోలీసులకు ఫిర్యాదు అందింది. నీట్ పరీక్షను అడ్డుకునేందుకు అంజామై సినిమా తీశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల అంజామై నిర్మాత, దర్శకుడు, హీరో హీరోయిన్ లను అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమిళనాడులోని చాలా రాజకీయ పార్టీలు నీట్ పరీక్షను వ్యతిరేకిస్తుండగా, నీట్ పరీక్ష అవసరం లేదు, నీట్ పరీక్ష వల్ల విద్యార్థులు ఎలా ప్రభావితమయ్యారు అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో దాఖలైన ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారా? అనేది చూడాలి.