Leading News Portal in Telugu

Nindha: కాండ్రకోట మిస్టరీనే ‘నింద’.. అస్సలు పోలిక ఉండదు: వరుణ్ సందేశ్ ఇంటర్వ్యూ


  • వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే సినిమా
  • కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’
  • ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన వరుణ్ సందేశ్
Nindha:  కాండ్రకోట మిస్టరీనే ‘నింద’.. అస్సలు పోలిక ఉండదు: వరుణ్ సందేశ్ ఇంటర్వ్యూ

Varun Sandesh Interview for Nindha Movie: వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే సినిమా తెరకెక్కింది. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించగా జూన్ 21న రాబోతోంది. ఈ క్రమంలో సినిమా విశేషాలను పంచుకునేందుకు హీరో వరుణ్ సందేశ్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ రొటీన్ సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్‌గా అనిపించింది. ఏంట్రా ఇలాంటి సినిమాలే చేస్తున్నానని అనుకునే సందర్భాలు వచ్చాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని యూఎస్ వెళ్లా. ఆ టైంలోనే రాజేష్ ఈ నింద కథను చెప్పారు. విన్న వెంటనే ఎంతో నచ్చింది. ఈ సినిమా చేసేద్దామని అన్నాను.


Chiranjeevi: చిరంజీవికి రాజ్యసభ.. ఓపెన్ అయిన కుమార్తె!

సినిమాలో నా పాత్రకి, నిజ జీవితంలోని నా పాత్రకి అస్సలు పోలిక ఉండదు. నేను బయట జాలీగా, చిల్‌గా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా సీరియస్‌గా ఉండను. కానీ ఈ చిత్రంలో నా వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్రను పోషించాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా కనిపిస్తానని అన్నారు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లలో ఎన్నో సినిమాలు వచ్చాయి. నింద విషయంలో మాత్రం స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉండబోతోంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు. అసలు పూర్తి కథను, స్క్రిప్ట్‌ని ఆర్టిస్టులెవ్వరికీ నెరేట్ చేయలేదు. దీంతో నటించే ఆర్టిస్టుల్లోనూ ఓ క్యూరియాసిటీ పెరిగింది. అసలు నేరస్థుడు ఎవరు? అనే విషయం తెలియకపోవడంతో సహజంగా నటించారు. కథ చెప్పినప్పుడు నేను గెస్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ నేను కూడా చెప్పలేకపోయానని అన్నారు.