Leading News Portal in Telugu

Kalki 2898 AD First Review: కల్కి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..టాక్ ఎలా ఉందంటే?


Kalki 2898 AD First Review: కల్కి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..టాక్ ఎలా ఉందంటే?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ కల్కి.. ఈ సినిమాకు తాజాగా సెన్సార్ టాక్ పూర్తయింది.. దాంతో టాక్ బయటకు వచ్చింది..డార్లింగ్ ఎప్పటిలాగే మూవీని అదరగోట్టాడు.. ఈ మూవీ సస్పెన్స్ లు ఓ రేంజులో ఉన్నట్లు టాక్.. ఇక ట్విస్టులు సినిమాకు హైలెట్ అంట. భైరవ పాత్రలో ప్రభాస్ దుమ్ములేపేశాడట. ఇలాంటి సినిమాను తీయడం, ఇలాంటి విజన్‌తో రావడంతో నాగ్ అశ్విన్‌కు మాత్రమే సాధ్యమని కొనియాడారు.. అతని డెడికేషన్ కు దండం పెట్టాల్సిందే.. అంత అద్భుతంగా సినిమా విజువల్స్ ఉన్నాయని వినిపిస్తోంది..


సినిమాను అంత అద్భుతంగా తియ్యడం కేవలం నాగ్ అశ్విన్ కే సాధ్యం అంటూ సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఆ ధైర్యానికి దండం పెట్టాల్సిందే అంటూ మోత మోగిపోతుంది. దాదాపు మూడు గంటల నిడివితో సినిమా రాబోతుంది. ప్రస్తుతం సినిమా బ్లాక్ బాస్టర్ అనే టాక్ వినిపిస్తుంది..ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది.. అందరు ఊహించినట్లే ఈ సినిమాకు యూ/ ఏ సర్టిఫికెట్ ను అందుకుంది.. సినిమాకు మొదటి నుంచి భారీ హైప్ క్రియేట్ అయ్యింది..

పాన్ ఇండియా మూవీ అంటూ ఓ రేంజులో టాక్ నడిచింది.. కానీ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ప్రమోషన్స్ లో స్పీడును పెంచలేదు మేకర్స్.. బుజ్జి అండ్ భైరవ అంటూ ఓ వారం రోజులు హంగామా చేశారు. అమెజాన్‌లో వదిలిన యానిమేషన్ ఎపిసోడ్స్ బాగానే ఉన్నాయి. కాంప్లెక్స్ ప్రపంచం, బుజ్జి, భైరవల స్నేహం గురించి చూపించారు. ఆ సీన్స్ పిల్లలను బాగానే ఆకట్టుకున్నాయి.. ఆ తర్వాత సౌండ్ ను పెంచలేదు.. ఓ పాటను రిలీజ్ చేశారు..ఈ సినిమా మీద భారీ స్థాయిలో బిజినెస్ అయితే జరుగుతోంది. ప్రీ సేల్స్‌తోనే నార్త్ అమెరికాలో రెండు మిలియన్ల డాలర్లకు పైగా రాబట్టేసింది.. సెన్సార్ టాక్ ఇదేనా? లేదా కల్కి టీమ్ ఇలా చేసిందా అనేది మాత్రం తెలియదు.. ఏది ఏమైనా ఈ టాక్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు నచ్చింది.. సంబరాలు మొదలెట్టేశారు..