Leading News Portal in Telugu

Kalki 2898 AD : కల్కికి రేణు దేశాయ్ రివ్యూ.. అరచీ అరచీ నా గొంతు పోయింది!


Kalki 2898 AD : కల్కికి రేణు దేశాయ్ రివ్యూ.. అరచీ అరచీ నా గొంతు పోయింది!

Renu Desai Review for Kalki 2898 AD : కల్కి 2898 AD సినిమాని ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఉన్న పీసీఎక్స్ స్క్రీన్ లో రేణు దేశాయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ స్క్రీనింగ్ కి ఆమె కుమారుడు అఖీరా నందన్ కూడా హాజరయ్యాడు. ఆఖీరా కల్కి టీ షర్ట్ ధరించి కనిపించడం గమనార్హం. ఇక ఈ సినిమా చూసిన తర్వాత రేణు దేశాయ్ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. కల్కి అభిమానులం మేము అంటూ పేర్కొన్న ఆమె చాలా కాలం తర్వాత ఒక సినిమా చూస్తూ చాలా బాగా అరిచి గోల చేశామని చెప్పుకొచ్చారు.


Kalki 2898 AD: కల్కి థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల పూనకాలు

ఈ దెబ్బతో కనీసం ఒక వారం రోజులైనా తన గొంతు పోయినట్టేనని ఆమె పేర్కొంది. ఇక ఈ రోజు ఉదయమే మార్నింగ్ షో కల్కి చూడడం కోసం వెళ్ళామని ఖచ్చితంగా మీరందరూ మీ కుటుంబాలతో వెళ్లి ఆ సినిమా చూడాలని ఆమె పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా తామంతా కల్కి అభిమానులమని రేణు దేశాయి పేర్కొనడం గమనార్హం. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. ప్రియాంక దత్, స్వప్న దత్ తో కలిసి అశ్విని దత్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇంకెందుకు ఆలస్యం రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో మీరు కూడా చూసేయండి మరి.