Leading News Portal in Telugu

Venu Swami: చేరాల్సిన చోటే చేరుతున్నాడు.. వేణు స్వామికి బంపర్ ఆఫర్


Venu Swami: చేరాల్సిన చోటే చేరుతున్నాడు.. వేణు స్వామికి బంపర్ ఆఫర్

Venu Swami to Enter Bigg Boss 8 Telugu House: వివాదం అంటే ఠక్కున గుర్తొచ్చే కార్యక్రమాల్లో బిగ్ బాస్ ముందు వరుసలో ఉంటుంది. తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ 7 సీజన్లు కూడా పూర్తి చేసుకుని 8వ సీజన్ లోకి అడుగు పెట్టనుంది. ఈ ఏడాది బిగ్ బాస్ 8 జరగనుంది. ఇక ఈ సీజన్ కి కంటెస్టెంట్ల విషయంలో బాగా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సెలబ్రిటీ జ్యోతిష్య పండిట్ వేణు స్వామి హౌస్ లోకి అడుగు పెడుతున్నట్టు తెలుస్తోంది. పలు సందర్భాల్లో వేణు స్వామి చెప్పిన చాలా అంచనాలు నిజమయ్యాయి. ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు మంచి పాపులారిటీ వచ్చి పడింది. అయితే ఈ మధ్య వేణు స్వామి తెలంగాణలో కేసీఆర్, ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పాడు కానీ అది జరగలేదు. ఆ తర్వాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని ఒక సంచలన ప్రకటన చేశారు.


Strong Bones : వృద్ధాప్యం వరకు ఫిట్‌గా, ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..

వేణు స్వామి ఇంటర్నెట్ కు దూరంగా ఉండాలని అనుకుంటున్నా నెటిజన్లు మాత్రం ఆయనను వదలడం లేదు. ఆయనకు ఉన్న ఈ క్రేజ్‌ని బిగ్ బాస్ టీం గుర్తించి ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వేణు స్వామి లోపలికి వెళ్తే కంటెంట్ ఇవ్వడం పక్కా కాబట్టి జనం టీవీలకు అతుక్కుపోతారని బిగ్ బాస్ నిర్వహకులు నమ్ముతున్నారట. ఈ క్రమంలోనే బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీ తీసుకొని పారితోషికం వేణు స్వామికి ఆఫర్ చేశారని అంటున్నారు. ఇక ఈమేరకు ప్రచారం జరుగుతూ ఉండగా అందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే బర్రెలక్కను, కుమారి ఆంటీని సెలెక్ట్ అయ్యారంటూ పలు వార్తలు వస్తున్న నేపథ్యంలో షో స్టార్ట్ అయితే కానీ అది ఎంతవరకు నిజం అనేది తెలియదు.