Leading News Portal in Telugu

Pawan Kalyan: మనం ఓజీ అంటే జనం క్యాజీ అంటారు.. సినిమాలపై పవన్ కీలక వ్యాఖ్యలు


  • నాకు సినిమాలు చేసే టైమ్ ఉంటుందా.?
  • క్షమించాలని నిర్మాతలను కోరా

  • 3 నెలల తర్వాత కుదిరినప్పుడు 2-3 రోజులు సినిమాలు చేస్తా
  • మనం OG అంటే.. ప్రజలు క్యాజీ అంటారు
  • మూడు నెలలపాటు షూటింగ్‌కు దూరంగా ఉంటా
  • కుదిరినప్పుడు మూడు రోజులు షూటింగ్‌కు వస్తా
  • నిర్మాతలను క్షమాపణలు కోరుతా
  • నిర్మాతలు ఆమేరకు అడ్జస్ట్‌ చేసుకోవాలి -డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
Pawan Kalyan: మనం ఓజీ అంటే జనం క్యాజీ అంటారు.. సినిమాలపై పవన్ కీలక వ్యాఖ్యలు

Deputy CM Pawan Kalyan Clarity on His Movies: తన సినిమాలు గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉప్పాడలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఉండగా సభకు హాజరైన పవన్ అభిమానులు ఓజీ ఓజీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం మొదలు పెట్టారు దీంతో పవన్ స్పందిస్తూ ఓజీ ఆ, అసలు సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? అని ప్రశ్నించారు. ఎలాగో మాట ఇచ్చాను కాబట్టి ముందు ఒక మూడు నెలలు, మీరు ఒక్కరోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని నన్ను తిట్టకూడదు కాబట్టి కనీసం గ్రామాల్లో కొత్త రోడ్ల కంటే ముందు పాత రోడ్లకే ఉన్న గుంతలు పూడ్చి, మళ్ళీ మీరు నన్ను తిట్టగూడదు కదా అని అన్నారు.


Nivetha Thomas: నాకు పెళ్లయింది.. నా భర్త, పిల్లలు వీళ్ళే.. నివేదా థామస్ షాకింగ్ కామెంట్స్ !

నాకు సినిమాలు చేసే టైమ్ ఉంటుందా.? అందుకే క్షమించాలని నిర్మాతలను కోరా. 3 నెలల తర్వాత కుదిరినప్పుడు 2-3 రోజులు సినిమాలు చేస్తా, మనం OG అంటే.. ప్రజలు క్యాజీ అంటారు. మూడు నెలలపాటు షూటింగ్‌కు దూరంగా ఉంటా, కుదిరినప్పుడు మూడు రోజులు షూటింగ్‌కు వస్తా అని ఆయన అన్నారు. నిర్మాతలను క్షమాపణలు కోరుతా, నిర్మాతలు ఆమేరకు అడ్జస్ట్‌ చేసుకోవాలి అని అంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. కాబట్టి వ్యాఖ్యలు బట్టి చూస్తే సెప్టెంబర్ కి ఓజీ రావడం కష్టమే.