Leading News Portal in Telugu

Kalki 2898 AD: ‘కల్కి’లో కృష్ణుడిగా మహేష్ బాబు.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్!


Kalki 2898 AD: ‘కల్కి’లో కృష్ణుడిగా మహేష్ బాబు.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్!

Nag Ashwin Comments on Mahesh Babu for Krishna Role in Kalki 2898 AD: విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నం ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్ లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ జూన్ 27న గ్రాండ్ గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మహా అద్భుతంగా అలరించి, ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.


Nag Ashwin: ప్రియాంకను పెళ్లి చేసుకోక పోతే కల్కి వచ్చేది కాదా?

ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ శంకరపల్లిలోని కల్కి సెట్స్ లో గ్రాండ్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ‘కల్కి 2898 AD’ విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగానే సోషల్ మీడియాలో మహేష్ బాబు కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రలో కనిపించి ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దానికి మీరేం అంటారు అని అడిగితే కచ్చితంగా మహేష్ బాబు కృష్ణుడి పాత్రలో బాగుంటారు, అయితే అది ఈ సినిమాలో కాదు వేరే సినిమాల్లో అని అంటూ నాగ్ అశ్విన్ కామెంట్ చేశారు. నిజంగానే మహేష్ బాబు శ్రీకృష్ణుడు పాత్ర చేస్తే బాగుంటుంది. అయితే ఈ సినిమాలో కాదు వేరే సినిమాలలో అని అంటూ నాగ అశ్విన్ చెప్పుకొచ్చారు. ఇక తనకు శ్రీకృష్ణుడి ముఖాన్ని చూపించే ఉద్దేశం లేదని ఇప్పటికే నాగ్ అశ్విన్ మరొక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.