Leading News Portal in Telugu

Nag Ashwin: ప్రియాంకను పెళ్లి చేసుకోక పోతే కల్కి వచ్చేది కాదా?


Nag Ashwin: ప్రియాంకను పెళ్లి చేసుకోక పోతే కల్కి వచ్చేది కాదా?

Nag Ashwin Comments on Kalki 2898 AD Press meet: కల్కి 2898 సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సుమారు వారం రోజుల తర్వాత సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయనకు అనేక రకాల ప్రశ్నలు ఎదురవగా ఆయన చాలా ఓపికగా ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చారు. అయితే అందులో ఆయనకు ఒక షాకింగ్ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే ఒకవేళ ప్రియాంక దత్ ను మీరు పెళ్లి చేసుకోకపోతే ఈ సినిమా మీరు చేయగలిగే వారా? అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అయితే దానికి నాగ్ అశ్విన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.


Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సినిమాపై పోస్ట్.. అభిమానికి డైరెక్టర్ స్ట్రాంగ్‌ కౌంటర్‌!

బహుశా చేయలేకపోయే వాడినేమోనని అన్నారు. ముందుగా ఈ విషయంలో వారికి థాంక్స్ చెప్పాలని అన్నారు. నేను అల్లుడిని అయినా సరే వాళ్లకు ఒక దర్శకుడు లాగానే పనిచేశానని అర్థం వచ్చేలా ఆయన కామెంట్ చేశారు. నిజానికి ఇది వైజయంతి మూవీస్ బ్యానర్ కి 50వ సంవత్సరంలో చేసే సినిమా. చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా, ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో ఇది కూడా ఒకటి. అయినా సరే ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమా నిర్మాణం విషయంలో ముందుకు వచ్చారని ఇప్పటికే పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేసే అంత కలెక్షన్స్ రావడంతో చాలా కృతజ్ఞతతో ఉంటానని ఆయన కామెంట్ చేశారు. ఇక అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్ ను నాగ్ అశ్విన్ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.