Leading News Portal in Telugu

Mahesh Babu: కల్కి 2898 ఏడీ సినిమాకి మహేష్ బాబు లేట్ రివ్యూ


Mahesh Babu: కల్కి 2898 ఏడీ సినిమాకి మహేష్ బాబు లేట్ రివ్యూ

Mahesh Babu Review for Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ అయి దాదాపు పది రోజులు అవుతోంది. ఈ సినిమా గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, అన్నా బెన్, దిశా పటానీ వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. కమల్ హాసన్ విలన్ గా నటించిన ఈ సినిమా చూసిన ఆడియన్స్ సహా సినీ సెలబ్రిటీలు సినిమా అద్భుతం అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన మహేష్ బాబు తన రివ్యూ ఇచ్చారు. కల్కి 2898 AD చూసా, నా మైండ్ బ్లాకయ్యింది. నాగశ్విన్ , మీ భవిష్యత్ దృష్టికి హ్యాట్సాఫ్. ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం.

Harom Hara OTT: ఓటీటీకి వచ్చేస్తున్న హరోం హర.. ఎప్పుడు? ఎక్కడ? చూడాలంటే!

అమితాబ్ బచ్చన్ సార్ మీ మహోన్నత స్క్రీన్ ప్రెజెన్స్ తో ఇంకెవరూ సరిపోలలేరు. కమల్ హాసన్ సార్ మీరు చూపించే ప్రతి పాత్ర ప్రత్యేకంగా మీదే. ప్రభాస్ మీరు మరో గొప్ప పనిని సులభంగా చేసేశారు. దీపికా పదుకొనే ఎప్పటిలాగే అద్భుతం. వైజయంతీ ఫిలిమ్స్ టీం మొత్తానికి ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు కంగ్రాట్స్ అని చెప్పారు. కల్కి 2898 ఏడీ రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగుతో పాటు ఓవర్ సీస్ లో అనేక రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికి విడుదలైన అన్నీ సెంటర్లో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. సోమవారం నాటికి కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్ల రాబట్టినట్టు వైజయంతి మూవీస్ సంస్థ ప్రకటించింది.