Leading News Portal in Telugu

Manchu Lakshmi: ఆ పని చేసిన వాళ్ళని రోడ్డు మీద అడ్డంగా నరకాలి


Manchu Lakshmi: ఆ పని చేసిన వాళ్ళని రోడ్డు మీద అడ్డంగా నరకాలి

Manchu Lakshmi Sensational Comments on Child Abusers: `చైల్డ్ అబ్యూజ్ చేసే వాళ్ళని రోడ్డు మీద అడ్డంగా నరకాలి అన్నారు మంచు లక్ష్మి. తాజాగా మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా “ఆదిపర్వం” ఈవెంట్ లో ఆమె ఈ మేరకు కామెంట్స్ చేశారు. తాజాగా ప్రణీత్ హనుమంతు అంశం మీద ఆమెను ప్రశ్నించగా చైల్డ్ అబ్యూజ్ ఎవరు చేసినా వాళ్ళని రోడ్డు మీద అడ్డంగా నరకాలి అన్నారు. శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళంలో పీరియాడిక్ డ్రామాగా “ఆదిపర్వం” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి.

Darshan: దర్శన్ మెడకు రేణుకాస్వామి హత్యకేసు.. పక్కా ఆధారాలు లభ్యం?

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆదిపర్వం” సినిమా త్వరలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమా సాంగ్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ “ఆదిపర్వం” లాంటి భారీ చిత్రాన్ని ఇంత త్వరగా సీజీ వర్క్ తో సహా కంప్లీట్ చేస్తారని నేను అనుకోలేదు. ఈ సినిమాకు ఒక భగీరథ ప్రయత్నం చేశారు మా దర్శకుడు సంజీవ్. ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్ని ప్రేక్షకులకు చూపిస్తున్నాం అంటే అది మన నేల గొప్పదనం. ఈ శక్తవంతమైన గడ్డ మీద ఉన్నాం కాబట్టే ఇలాంటి నేపథ్యాలతో సినిమాలు చేయగలుగుతున్నాం. దేవత అయినా దెయ్యం అయినా నన్నే అప్రోచ్ అవుతున్నారు. “ఆదిపర్వం” మీ అందరికీ నచ్చేలా ఉంటుందని చెప్పగలనన్నారు.