Leading News Portal in Telugu

Rana Daggubati : బాహుబలి బ్యానర్లో రానా కొత్త సినిమా.. కానీ?


Rana Daggubati : బాహుబలి బ్యానర్లో రానా కొత్త సినిమా.. కానీ?

Rana Daggubati Movie with Debutant Kishore in Arka Media Works Banner: అనారోగ్య కారణాలతో సహా పలు కారణాలు చెబుతూ రానా దగ్గుబాటి నటనకు దూరమయ్యాడు. చివరిగా పూర్తిస్థాయిలో 1945 అనే సినిమా చేసిన ఆయన 2023లో కేవలం స్పై అనే సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో మాత్రమే కనిపించాడు. ఆయన హీరోగా రాక్షస రాజు అనే సినిమాని తేజ అనౌన్స్ చేశాడు కానీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు. ఇది ఇలా ఉండగా రానా ఒక కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కిషోర్ అనే ఒక కొత్త దర్శకుడు ఇప్పటికే పలు సినిమాలకు రచయితగా పనిచేశాడు. ఇప్పుడు కొత్త స్క్రిప్ట్ తో రానాని సంప్రదించగా రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Urvashi Rautela: బాలయ్య సినిమా షూటింగ్‌లో ఊర్వశి రౌతేలాకి తీవ్ర గాయాలు?

అంతేకాదు బాహుబలి నిర్మాతలైన ఆర్కా మీడియా వర్క్స్ ఈ సినిమా కథ నచ్చడంతో నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది. అక్టోబర్ నుంచి షూటింగ్ ప్లాన్ కూడా చేసుకుంటున్నారు. అయితే రానా హీరోగా నటించడం లేదనే మాటే కానీ సినిమాల ప్రమోషన్స్ విషయంలో మాత్రం ముందే ఉంటున్నాడు. కేవలం చిన్న సినిమాలను ప్రమోట్ చేయడం మాత్రమే కాదు కల్కి లాంటి సినిమాలకు కూడా ఆయన బాలీవుడ్ లో ప్రమోషన్స్ విషయంలో సహాయం చేశాడు. ఇక ఇప్పుడు ఆయన మరోసారి ఒక ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైనట్లు చెప్పవచ్చు.