Leading News Portal in Telugu

Sundeep Kishan: సందీప్ కిషన్ హోటల్ తనిఖీ వార్తలు.. అసలు నిజాలు బయటపెట్టిన హీరో


Sundeep Kishan: సందీప్ కిషన్ హోటల్ తనిఖీ వార్తలు.. అసలు నిజాలు బయటపెట్టిన హీరో

Sundeep Kishan Clarity on Food Safety Rides on Vivaha Bhojanambu: తాను నడుపుతున్న వివాహ భోజనంబు రెస్టారెంట్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు అనంతరం వచ్చిన వార్తల మీద హీరో సందీప్ కిషన్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక క్లారిఫికేషన్ విడుదల చేశారు. దయచేసి మీడియా మిత్రులు ఆసక్తికరమైన హెడ్లైన్స్ పెట్టి వార్తలు రాసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. గత ఎనిమిదేళ్లుగా వివాహ భోజనంబు అనే పేరుతో మేము చాలా నమ్మకమైన సేవలు అందిస్తూ వస్తున్నామని మీ ప్రేమను ఎప్పుడూ వృధా చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే వస్తున్న వార్తలకు ఆయన క్లారిటీ ఇస్తూ ప్రతి విషయాన్ని షేర్ చేశారు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగానే అన్ని విషయాల మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా కొన్ని ఫోటోలు తమ కిచెన్ కి సంబంధించినవి కావాని, అయినా తమ కిచెన్ లోని ఫోటోలుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు.

Darshan: ఇంటి ఆహారం కోసం హైకోర్టులో హీరో దర్శన్ పిటిషన్

2022 ఎక్స్పైరీ డేట్ తో ఉన్న చిట్టి ముత్యాలు రైస్ బ్యాగ్ తమ హోటల్ లో ఉన్న మాట వాస్తవమే కానీ అది ఇప్పటివరకు సీల్ తీయని ఒక శాంపిల్ బ్యాగ్ అని తమ వెండర్ ఒకరు శాంపిల్ కోసం పంపితే దాన్ని ఒక పక్కగా పెట్టి ఉంచామని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని బ్యాగ్ సీల్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం ధ్రువీకరించారని అన్నారు. అలాగే కిచెన్లో నీళ్లు నిలిచిపోయాయి అన్నట్టుగా ప్రచారం జరుగుతున్న ఫోటోలో నీళ్లు నిలవలేదని అవి బయటకు వెళుతూ ఉండగా తీసిన ఫోటో అని చెప్పుకొచ్చారు. ప్రతి గంట గంటకు మేము కిచెన్ క్లీన్ చేస్తూనే ఉంటామని ఆయన వెల్లడించారు. అంతేకాక మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు తాము టేస్టింగ్ సాల్ట్స్ వంటివి అసలు ఉపయోగించమని వాటికి సంబంధించిన ఫోటోలు తమ కిచెన్లోకి కావని తేల్చి చెప్పారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కుకింగ్ అండ్ సేఫ్టీకి సంబంధం లేని చిన్న చిన్న విషయాలను మాత్రమే గుర్తించారని వాటిని కూడా మేము సరిదిద్దుకునే పనిలో ఉన్నామని అన్నారు. ఎప్పటిలాగే ఫుడ్ సేఫ్టీ విషయంలో టేస్ట్ విషయంలో క్వాలిటీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని వివాహ భోజనంబు పేరుతో ఒక క్లారిఫికేషన్ నోట్ రిలీజ్ చేశారు సందీప్ కిషన్.