Leading News Portal in Telugu

Venky Anil3: యానిమల్ నటుడిని దింపుతున్న రావిపూడి


Venky Anil3: యానిమల్ నటుడిని దింపుతున్న రావిపూడి

Anil Ravipudi roped in Upendra Limaye into Venky Anil3 Movie: గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. తృప్తి దిమ్రీ, బాబీ డియోల్ వంటి వారు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఫ్రెడ్డీ అనే ఒక చిన్న పాత్రలో ఉపేంద్ర లెమాయి అనే ఒక మరాఠీ నటుడు నటించాడు. స్వయంగా రణబీర్ కపూర్ సిద్ధం చేసుకున్న ఒక గన్ డెలివరీ ఇచ్చేందుకు వచ్చిన ఫ్రెడ్డీ వాట్ ఏ విజన్ వాట్ ఏ థాట్ అనే డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యాడు.

Jr.Ntr : దేవర నుండి అదిరిపోయే న్యూస్..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

అతని ఫోటోతో అనేక మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ సినిమాలో అతన్ని తీసుకున్నట్లు అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో ఆయన పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని అతనిని పరిచయం చేసినందుకు సందీప్ రెడ్డి వంగాకి థాంక్స్ చెబుతున్నానని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలైనట్టు చెబుతున్నారు.