Leading News Portal in Telugu

Aman Preet: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సోదరుడు


Aman Preet: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సోదరుడు

Rakul Brother Aman Preet Named A6 in Drugs Case: హైదరాబాద్లో తాజాగా ఒక భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు నటుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్టు అయ్యాడు. ప్రస్తుతం అతను పోలీసులు కస్టడీలో ఉన్నాడు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఎస్ఓటీ పోలీసులతో పాటు రాజేంద్రనగర్ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్ లో కొంతమంది డ్రగ్స్ అమ్మకం దారులతో పాటు కొనుగోలుదారులు కూడా దొరికిపోయారు. డ్రగ్స్ కొనుగోలుదారులలో అమన్ ప్రీత్ సింగ్ కూడా ఒకరిగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఇక ఈ రైడ్ లో దాదాపు 200 గ్రాములకు స్వాధీనం చేసుకున్నారు నార్సింగ్ పోలీసులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 18 మంది మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇక ఈ కేసులో అమన్ ప్రీత్ సింగ్ ని ఏ సిక్స్ గా నమోదు చేశారు పోలీసులు.

Jai Balayya: జై బాలయ్య అంటూ ఊగిపోయిన రానా

అరెస్ట్ అయిన వారిలో ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు ఉన్నారు. వీళ్ళ నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు, 13 మందికి డ్రగ్ టెస్ట్ లు చేయగా.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు. అమన్ తో పాటు.. ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, ధావన్ ఉన్నారు. అరెస్ట్ అయిన పెడ్లర్ల లో ఇద్దరు నైజీరియన్లు బ్లెస్సింగ్స్, నోహిమ్ లతో పాటు లోకల్ పెడ్లర్లు అల్లం గౌతం, వరుణ్ కుమార్, మహబూబ్ షరీఫ్ ఉన్నారు. కీలక నిందితుడు ఎబుకా పరారీలో ఉన్నాడు. నార్సింగి డ్రగ్స్‌ కేసులో ఐదుగురు నిందితులకు 14 రోజుల డిమాండ్‌ విధించారు. జులై 30 వరకు ఉప్పరపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్‌ విధించగా ఆ ఐదుగురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు నార్సింగి పోలీసులు.