Leading News Portal in Telugu

Tollywood: చిన్న సినిమాలకు చిన్న సినిమాలే విలన్స్!


Tollywood: చిన్న సినిమాలకు చిన్న సినిమాలే విలన్స్!

8 Small Movies to Release on August 2nd: తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపుగా రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసిన పెద్ద సినిమాలు వచ్చేశాయి. కొన్ని సినిమాలు వెనక్కి వెళ్లాయి. దీంతో ఆగస్టు నెలలో చిన్న సినిమాలు ఒక్కసారిగా పోటీ పడుతున్నాయి. ఏకంగా ఆగస్టు రెండో తేదీన ఇప్పటికే అరడజను సినిమాలు రిలీజ్ అయ్యేందుకు డేట్లు అనౌన్స్ చేశాయి. అయితే అందులో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఏది వాయిదా పడుతుందో అనే విషయం మీద అయితే క్లారిటీ లేదు. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ లో అనౌన్స్ చేసిన సినిమాల విషయానికి వస్తే రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ఆపరేషన్ రావణ్ సినిమా , విజయ భాస్కర్ కొడుకు హీరోగా ఉషా పరిణయం, రాజ్ తరుణ్ హీరోగా తిరగబడరా సామి సినిమాలతో పాటు ఒకరోజు ముందుగానే ఆగస్టు ఒకటో తేదీన ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటించిన శివం భజే సినిమా రిలీజ్ అవుతున్నాయి.

Music Shop Murthy: ఓటీటీలో అజయ్ ఘోష్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’.. ఎక్కడ చూడాలంటే?

ఇక వీటికి తగ్గట్టుగానే వరుణ్ సందేశ్ విరాజి సినిమా కూడా ఆగస్టు రెండో తేదీనే రిలీజ్ అవుతుంది. ఇక ఇప్పుడు తాజాగా అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ సినిమాని కూడా ఆగస్టు రెండో తేదీన రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తుఫాన్ సినిమాని కూడా ఆగస్టు రెండో తేదీనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అలాగే మరో చిన్న సినిమా అలనాటి రామచంద్రుడు కూడా అదే రోజున రిలీజ్ చేస్తున్నారు. ఒకరకంగా చూస్తే చిన్న సినిమాలకు చిన్న సినిమాలే విలన్స్ అన్నట్టుగా ఏకంగా ఒకేరోజు అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ డేట్ లో అనౌన్స్ చేయడం గమనార్హం.