Leading News Portal in Telugu

Music Shop Murthy: ఓటీటీలో అజయ్ ఘోష్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’.. ఎక్కడ చూడాలంటే?


Music Shop Murthy: ఓటీటీలో అజయ్ ఘోష్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’.. ఎక్కడ చూడాలంటే?

Music Shop Murthy getting Huge Response in OTT: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రానికి థియేటర్లలో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు కూడా. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఏకంగా రెండు ఓటీటీలలో ఈ సినిమా సందడి చేస్తోంది. ఒక పక్క అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్ పై హర్ష గారపాటి – రంగారావు గారపాటి నిర్మించగా శివ పాలడుగు రచన మరియు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్‌ని సైతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది.

Janasena: రేపట్నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలతో, మంచి సందేశంతో కూడిన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ ను సైతం ఆకట్టుకుంటోంది. థియేటర్లో వచ్చినట్టుగానే ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. సినిమాను థియేటర్లలో చూడని వారంతా ఇప్పుడు చూస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో కనిపించిన అజయ్ ఘోష్ సహజమైన నటనకి కూడా ఆడియెన్స్ ను ప్రశంసలు దక్కుతున్నాయి. ఎప్పటిలానే చాందినీ చౌదరి తన నటనతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారనే చెప్పాలి. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్ మరియు దయానంద్ రెడ్డి ముఖ్యమైన పాత్రలను పోషించగా శ్రీనివాస్ బెజుగం సినిమాటోగ్రఫీ, పవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.