Leading News Portal in Telugu

Operation Raavan: వారం ముందే రాబోతున్న “ఆపరేషన్ రావణ్”..


  • ఇదివరకు ఆగష్టు 2 న “ఆపరేషన్ రావణ్” సినిమాని విడుదల.
  • తాజా సమాచారం మేరకు వారం రోజుల ముందుగా.. అంటే జులై 26వ తేదీన రిలీజ్.
  • రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో “ఆపరేషన్ రావణ్”.
Operation Raavan: వారం ముందే రాబోతున్న “ఆపరేషన్ రావణ్”..

Operation Raavan Release on July 26: రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో చేస్తున్న సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ సినిమాను ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమాను దర్శకుడు వెంకట సత్య తెరకెక్కించాడు. తెలుగు, తమిళ బాషల్లో సినిమాను పెంపొందించారు. ఇందులో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఇదివరకు ఆగష్టు 2 న “ఆపరేషన్ రావణ్” సినిమాని విడుదల చేద్దాం అనుకున్న తాజా సమాచారం మేరకు వారం రోజుల ముందుగా.. అంటే జులై 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.

AAP: మిత్రపక్షాల మధ్య విభేదాలు.. హర్యానాలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదన్న ఆప్

ఇదివరకు రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇంకా కొందరు నటులు కీలక పాత్రల్లో నటించారు. ఇకపోతే ఈ సినిమా విజయంపై సినిమా బృందం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక ఈ సినిమాలో రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితర నటినలు నటించారు. మొత్తానికి సినిమా అనుకున్న దానికంటే వారం ముందే జులై 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది “ఆపరేషన్ రావణ్” సినిమా.

Cyber ​​crimes: టీజీ రైతులకు అలర్ట్..ఆ లింక్ లు ఓపెన్ చేస్తే..రుణమాఫీ డబ్బులు మాయం..!

ఇక ఈ సినిమాకు సంగీతం శరవణ వాసుదేవన్, డైలాగ్స్ లక్ష్మీ లోహిత్ పూజారి, ఎడిటర్ గా సత్య గిద్దుటూరి, ఆర్ట్ గా నాని. టి, ఫైట్స్ ను స్టంట్ జాషువా, కోరియోగ్రఫీగా జేడీ, ఛాయాగ్రహణంకు నాని చమిడిశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా శ్రీపాల్ చొళ్లేటి, పిఆర్ఓ జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), నిర్మాతగా ధ్యాన్ అట్లూరి, రచన-దర్శకత్వం వెంకట సత్య నిర్వహిస్తున్నారు.