Leading News Portal in Telugu

Aham Reboot : ఓటీటీలో సుమంత్ సినిమా రేర్ ఫీట్


Aham Reboot : ఓటీటీలో సుమంత్ సినిమా రేర్ ఫీట్

Aham Reboot got 2 Crore Streaming Minutes in AHA: ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల మైండ్ సెట్ బాగా మారింది. ఎంతో కొంత కొత్తదనం లేదా ప్రయోగాలు లేదా భారీ బడ్జెట్ విజువల్స్ ఉంటే కానీ వారికి ఎక్కడం లేదు. ఈ క్రమంలోనే అహాం రిబూట్ అనే సినిమా తరకెక్కింది. అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ హీరో గా నటించిన అహాం రిబూట్ ఓటిటి ఫ్లాట్ ఫాం ఆహాలో సూపర్ సక్సెస్ అందుకుంది. కేవలం ఒకే పాత్రతో తెరకెక్కిన ఈ సినిమా ఆర్జె నిలయ్ గా సుమంత్ నటన ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు. జులై 1 నుండి డైరెక్ట్ గా ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అహం రీబూట్ ప్రేక్షకుల ఆదరణ పొందుతూ రెండు కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతోందని టీం వెల్లడించింది.

Thangalaan: పుష్ప మిస్సయిన డేట్ కి వస్తున్న స్టార్ హీరో మూవీ

హీరో సుమంత్ కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిస్తుందని వారు వెల్లడించారు. వాయు పుత్ర ఎంటర్ టైన్మంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత రఘువీర్ గొరిపర్తి ఈ మూవీని నిర్మించగా జీవితంలో ఫెయిల్ అయి ఆర్జెగా పనిచేస్తున్న నిలయ్ గా సుమంత్ నటించాడు. సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు ప్రశాంత్ అట్లూరి సక్సెస్ అయ్యారు. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ ని బ్రేక్ చేయకుండా గ్రిప్పింగ్ గా కథనం నడిపాడని చెప్పొచ్చు. కేవలం గంటన్నర మాత్రమే ఉండే ఈ మూవీని ఒక కథలా కంటే ఒక ఇన్సిడెంట్ లా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడని కామెంట్స్ వస్తున్నాయి.