Leading News Portal in Telugu

Pranayagodari: ఆసక్తిరేపుతున్న `ప్రణయ గోదారి` గ్లింప్స్‌


Pranayagodari: ఆసక్తిరేపుతున్న `ప్రణయ గోదారి` గ్లింప్స్‌

Pranayagodari First Glimpse Released : రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం ‘ప్రణయగోదారి’. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎటువంటి పాత్రనైనా చాలా అవలీలగా పోషించి, ప్రేక్షకులను మెప్పించే డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్ రావినూతల ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పవర్‌ఫుల్‌ గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక ప్రణయగోదారి సినిమా గ్లింప్ల్‌ చూస్తుంటే.. సన్నివేశాలు.. సంభాషణలు పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి.

Director Suicide: ఇండస్ట్రీలో విషాదం.. షూటింగ్ పెండింగ్ లో ఉండగా దర్శకుడు సూసైడ్

కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో పెదకాపు పాత్రలో ఊరి పెద్దలాగా కనిపిస్తుండగా ఆయన చెప్పిన డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘తప్పు ఎవరు చేసినా తీర్పు ఒక్కటే’, ‘ఆకాశానికి హద్దుండదు ఈ పెదకాపు మాటకు తిరుగుండదు’……. ‘నే పుట్టిన ఈ గోదారి తల్లి మీద ఒట్టు’ అని సాయికుమార్ తన పవరఫుల్ డైలాగులతో మెస్మరైజ్ చేశాడు. ‘ప్రాణం పోయినా సహిస్తాను….భరిస్తాను …నా సహనాన్ని.. మంచితనాన్ని పరీక్షించొద్దు’ అనే డైలాగుతో చాలా కోపంగా కనిపిస్తున్నారు. గ్లింప్స్‌ను చూస్తే సినిమా మొత్తానికి సాయికుమార్ పాత్ర చాలా ముఖ్యమైనదిగా తెలుస్తుంది. అలాగే గోదారి నది ఒడ్డున హీరో హీరోయిన్ల ఆటలు, వారి ప్రేమాయణం సన్నివేశాలు చూస్తుంటే ఈ చిత్రంలో యువతను అలరించే అంశాలు కూడా ఉన్నట్లు చెప్పవచ్చు. సదన్, ప్రియాంక ప్రసాద్, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా త్వరలో పేక్షకుల ముందుకు రానుంది.