Leading News Portal in Telugu

Double Ismart: హనుమాన్ నిర్మాతల చేతికి డబుల్ ఇస్మార్ట్


Double Ismart: హనుమాన్ నిర్మాతల చేతికి డబుల్ ఇస్మార్ట్

Prime Show Entertainment Acquire 5 Languages Worldwide Distribution Rights Of Double Ismart: ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి & చైతన్య రెడ్డి ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్, కాంబోలో తెరకెక్కుతున్న పూరి కనెక్ట్స్ డబుల్ ఇస్మార్ట్ యొక్క 5 భాషల ప్రపంచవ్యాప్త పంపిణీ హక్కులు కొనుగోలు చేశారు. రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ మీద జనాలలో ఆసక్తి ఉంది. ఈ సినిమా పోస్టర్‌లు, టీజర్ మరియు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. భారీ బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాస్, యాక్షన్, డ్రామా మరియు వినోదం యొక్క డబుల్ డోస్ ఉంటుందని అంటున్నారు. డబుల్ ISMART ఆగష్టు 15న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Hamas-Israel war: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. చిన్నారుల సహా 16 మంది మృతి

ఈ సినిమాకి గురువారం (స్వాతంత్ర్య దినోత్సవం), సోమవారం (రక్షా బంధన్) సెలవులతో 5 రోజుల సుదీర్ఘ వీకెండ్ వలన మంచి కలెక్షన్లు వస్తాయని భావిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి ఐదు భాషల తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల డబుల్ ఇస్మార్ట్ ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను భారీ రేటుకు కొనుగోలు చేశారు. పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని రిలీజ్ చేసిన వీరు మొత్తం ఐదు భాషల్లో డబుల్ ISMART కోసం పెద్ద రిలీజే ప్లాన్ చేశారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్ – ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీతం అందించారు. సామ్ కె నాయుడు, జియాని జియానెలీ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో అలీ, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.