Leading News Portal in Telugu

Tamannaah Bhatia: అందచందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న తమన్నా..


  • ప్రస్తుతం తమన్న బాలీవుడ్లో స్త్రీ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
  • విడుదలైన పాటలో తమన్నా గ్రీన్ డ్రెస్సులో మైమరిపించింది.
  • అదిరిపోయే స్టెప్స్ తో కుర్రకారులను తల తిప్పుకోకుండా చేస్తోంది.
Tamannaah Bhatia: అందచందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న తమన్నా..

Tamannaah Bhatia Stree 2 Song Aaj Ki Raat Out: మిల్కీ బ్యూటీ తమన్నా.. గురించి సగటు సినీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్, డాన్స్ లతో అనేకమంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది. హీరోయిన్, సపోర్టింగ్ రోల్, స్పెషల్ అప్పీరెన్స్ ఇలా ఏదైనా సరే తమన్న తన స్థాయికి తగ్గట్టుగా ప్రూవ్ చేసుకుంటుంది. ప్రేక్షకులను మెప్పించడానికి తన వంతు పూర్తి ప్రయత్నాన్ని చేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం తమన్న బాలీవుడ్లో స్త్రీ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే స్త్రీ మొదటి పార్ట్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్ లో తమన్నా ఉండటం అందర్నీ ఆశర్య వ్యక్తం చేస్తుంది.

Railway Minister Ashwini Vaishnaw: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు.. ఏపీలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి రూ. 9151 కోట్లు

ఈ మధ్యకాలంలో తమన్నా సినిమాలు కంటే.. పాటలతోనే ఎక్కువ హడావిడి చేస్తోంది. తమన్నా సినిమాలలో ఒక్క పాట కోసం కూడా నటిస్తోంది. ఇదివరకు రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేస్తూ.. ‘వాహ్.. నువ్వు కావాలయ్యా’ అనే పాట కూడా చేసింది. ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ప్రస్తుతం నటిస్తున్న స్త్రీ 2 చిత్రంలో తమన్నా తన అందచందాలతో కుర్రాళ్లను మత్తెక్కిస్తోంది. ఇందుకు సంబంధించి ” ఆజ్ కి రాత్ ” అనే పాటను విడుదల చేశారు. ఈ పాట విడుదల కావడంతో సినిమాపై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఎక్కువయ్యాయి.

Paris: ఆస్ట్రేలియా మహిళపై గ్యాంగ్ రేప్.. ఒలింపిక్స్‌కి ముందు ఘటన..

క్రేజీ హర్రర్ కామెడీగా వచ్చిన స్త్రీ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రావడంతో భారీగా అంచనాలు ఉన్నాయి. మూవీ మేకర్స్ కూడా ఇందుకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా సినిమాలోని విడుదలైన ఫుల్ పాటలో తమన్నా గ్రీన్ డ్రెస్సులో మైమరిపించింది. అదిరిపోయే స్టెప్స్ తో కుర్రకారులను తల తిప్పుకోకుండా చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పాటను ఓసారి చూసేయండి.