Leading News Portal in Telugu

Devara: ‘దేవర’లోకి నాగవంశీ.. భలే ఎంట్రీ ఇచ్చాడే!


Naga Vamsi to Release Devara in Telugu States: గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు తీసుకొస్తూ నాగవంశీ చేస్తున్న హడావిడి కి క్లారిటీ వచ్చేసింది. అసలు విషయం ఏమిటంటే దేవర సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు నాగ వంశీ దక్కించుకున్నాడు. ఇప్పుడు నాగ వంశీ ఈ దేవర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయబోతున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడిస్తూ ఒక అధికారికి ప్రకటన చేశారు. తారక్ దేవర సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో తన డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లు నాగవంశీ ప్రకటించారు. వీరిద్దరూ కలిసి గతంలో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. గురూజీగా పిలుచుకునే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడమే కాక కలెక్షన్లు వర్షం కూడా కురిపించింది.

Donald Trump: ఆమె భారతీయురాలా..? నల్లజాతీయురాలా?.. కమలా హారిస్‌ని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యలు..

ఇప్పుడు దేవర సినిమా కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని నాగ వంశీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల దేవర హక్కులు ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయి అనే విషయం మీద క్లారిటీ లేదు. అయితే గట్టి రేటే నిర్మాతలు కోట్ చేయగా దానిని నాగ వంశీ దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక దేవర సినిమాకి సంబంధించిన మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేవర సినిమాని కొరటాల శివ చాలా కేర్ఫుల్గా తెరకెక్కిస్తున్నారు. ఆచార్య రిజల్ట్ తర్వాత కచ్చితంగా హిట్టు కొట్టాలని చాలా కసిగా పని చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక తెలుగు సినీ పరిశ్రమతో పాటు సౌత్ నార్త్ భాషలలో స్టార్ నటీనటులుగా ఉన్న చాలా మంది ఈ సినిమాలో భాగమవుతున్నారు.