Leading News Portal in Telugu

Kerala floods: వయనాడ్ బాధితులకు బాధ్యతగా బన్నీ.. సాయం ఎంతంటే..?


  • కేరళలోని వయనాడ్ లో వరదల విలయం
  • వందల మందికి పైగా గల్లంతు
  • భాదితులకు అండగా కదిలిన సినిమా హీరోలు
Kerala floods: వయనాడ్ బాధితులకు బాధ్యతగా బన్నీ.. సాయం ఎంతంటే..?

కేరళలోని వయనాడ్ జిల్లాలో వరదలు కారణంగా కొండచరియలు విరిగి పడి వందల మంది చనిపోగా వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగానే వారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఈ విషాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువరు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వయనాడ్ బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు వయనాడ్ భాదితులకు పెద్ద మొత్తంలో విరాళాలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు.

విషాద ఘటనపై మలయాళం స్టార్ హీరోలు పెద్ద మనసుతో స్పందించారు. అక్కడి మెగాస్టార్ మమ్ముట్టి, అతని కొడుకు, మరో స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్, అతని భార్య నజ్రియా, తమిళ హీరో విక్రమ్, సూర్య, జ్యోతిక, కార్తీ లాంటి వాళ్లు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద మొత్తంవిరాళం ఇచ్చారు. ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రూ. 3 కోట్లు విరాళం అందజేశారు.

తాజగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన వంతు భాద్యతగా ముందుకొచ్చాడు. బన్నీ వ్యక్తిగత ‘X’ ఖాతాలో వ్యాఖ్యానిస్తూ “వాయనాడ్‌లో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటం పట్ల నేను చాలా బాధపడ్డాను. కేరళ ఎల్లప్పుడూ నా మీద చాలా ప్రేమ చూపించింది, నా వంతు సాయంగా పునరావాస పనులకు కేరళ CM రిలీఫ్ ఫండ్‌కు ₹.25 లక్షలు విరాళంగా ఇవ్వడం ద్వారా నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. మీ భద్రత మరియు బలం కోసం ప్రార్థిస్తున్నాను” అని పోస్ట్ పెట్టాడు పుష్ప.