Leading News Portal in Telugu

Mr Bachchan: దారుణమైన ట్రోల్స్.. టీం సంచలన నిర్ణయం


Mr Bachchan: దారుణమైన ట్రోల్స్.. టీం సంచలన నిర్ణయం

Mr Bachchan Team Trims 13 Minutes from the Movie: రవితేజ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ అనే సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమాని విశ్వప్రసాద్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అవ్వాల్సి ఉంది అయితే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ తో ప్రారంభించేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమాలో కొన్ని సీన్స్ విషయంలో చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Brahma Anandam: ‘బ్రహ్మ ఆనందం’ వస్తున్నాడు చూశారా?

ప్రేక్షకుల ఫీడ్బ్యాక్, జరుగుతున్న ట్రోలింగ్ పరిశీలించిన పిదప సినిమాలో 13 నిమిషాల కంటెంట్ ట్రిమ్ చేసి రేపటి నుంచి కొత్త మిస్టర్ బచ్చన్ సినిమాని చూపించబోతున్నామంటూ టీం ఒక అధికారిక ప్రకటన చేసింది. మిరపకాయ్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఆ అంచనాలను పూర్తిస్థాయిలో హరీష్ శంకర్ అందుకోలేకపోయాడు. ఇక హరీష్ శంకర్ టేకింగ్ గురించి చాలా పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. రవితేజ, భాగ్యశ్రీ ఇద్దరి వయసు గురించి కూడా చర్చలు జోరుగా సాగాయి. అయితే హరీష్ శంకర్ తనదైన శైలిలో వాటిని ఖండిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కంటెంట్ లో 13 నిమిషాలు కట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికర అంశం.