Leading News Portal in Telugu

Akash Jagannadh: ‘తల్వార్’ పట్టిన పూరీ కొడుకు


Akash Jagannadh: ‘తల్వార్’ పట్టిన పూరీ కొడుకు

Akash Jagannadh’s “Thalvar” Launched with Pooja Ceremony: సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ్ కొడుకు, యంగ్ టాలెంటెడ్ హీరో ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “తల్వార్” ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మిస్తుండగా కొత్త దర్శకుడు కాశీ పరశురామ్ రూపొందిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన తల్వార్ సినిమా ప్రారంభోత్సవంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Bhale Unnade: పెళ్ళికి ముందే వేసి చూసుకునే రూల్ పెట్టాలట… రాజ్ తరుణ్ ఈసారి గట్టిగా కొట్టేట్టున్నాడే!

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, ఆరెక్స్ 100 ఫేమ్ హీరో కార్తికేయ స్క్రిప్ట్ హ్యాండోవర్ చేశారు. డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్త్తోంది. భారీ తారాగణం నటించబోతున్న ఈ సినిమా గురించి అని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.