Leading News Portal in Telugu

Lucky Baskhar: దీపావళికి లక్కీ భాస్కర్ దిగుతున్నాడు!


  • సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ కావాల్సిన దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్

  • సినిమా వాయిదా వేస్తున్నట్లు యూనిట్ ప్రకటన

  • దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన లక్కీ భాస్కర్ రిలీజ్
Lucky Baskhar: దీపావళికి లక్కీ భాస్కర్ దిగుతున్నాడు!

Dulquer Salmaan Lucky Baskhar Set for Release on 31st October 2024: తెలుగులో ఇప్పటికే మహానటి, సీతారామం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించారు. 80-90 లలో ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీతో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య నిర్మించారు.

Hema: నేను డ్రగ్స్ తీసుకోలేదు.. పరువు భూస్థాపితం చేశారు.. డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్మెంట్ కావాలి!

శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సినిమా వాయిదా వేస్తున్నట్లు తాజాగా సినిమా యూనిట్ ప్రకటించింది. ప్రతి భాషలో అక్కడి లోకల్ ఫ్లేవర్ రావడం కోసం డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నామని, ఇప్పటికిప్పుడు కంగారుగా సినిమాను తీసుకురావడం కంటే దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన రిలీజ్ చేయడం మంచిదని అప్పటికి వాయిదా వేశామని ప్రకటించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఒక పాట అలాగే టీజర్ సినిమా మీద అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఆ అంచనాలను ఆధారంగా చేసుకుని మరింత పర్ఫెక్ట్ గా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సినిమా యూనిట్ వెల్లడించింది.