- తారక్ – శివ కొరటాల కాంబోలో దేవర
- రిలీజ్ అయిన రెండు సాంగ్స్ సూపర్ హిట్స్
- రికార్డ్స్ క్రియేట్ చేసిన చుట్టమల్లే సాంగ్

జూనియర్ ఎన్టీయార్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా దేవర. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ క్వీన్ జాన్వీ కపూర్ తారక్ తో ఆడిపాడనుంది. దేవర నుండి అనిరుద్ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన ‘చుట్టమల్లే..’ పాట విపరీతమైన ట్రోలింగ్‌కు గురైంది. కానీ ఇప్పుడు అదే పాట సరికొత్త రికార్డు నెలకొల్పింది. రిలీజ్నాటి నుండి మిలియన్ వ్యూస్ రాబట్టిన చుట్టమల్లే సాంగ్ ఇప్పుడు ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేసింది. లిరికల్ సాంగ్స్ వ్యూస్ పరంగా అత్యధిక వ్యూస్ సాధించి రెండో స్థానంలో దేవర సెకండ్ సాంగ్ నిలిచింది.
తాజాగా చుట్టమల్లే సాంగ్ మారో రేర్ ఫీట్ సాధించింది. ఈ సాంగ్ కు సోషల్ మీడియాలో అన్ని భాషలు కలిపి ఇప్పటి వరకూ 5 లక్షలకు పైగా రీల్స్ వచ్చాయి. అలాగే ఇన్ స్టాగ్రామ్ టాప్ సాంగ్స్ లోట్రేడింగ్ లో కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి ఓ చిన్నపాటి వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పాటలోని తారక్ – జాన్వీ ల కెమిస్ట్రీ కి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు ఫిదా అయిపోయారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ల పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వినాయక చవితి కనుకగా దేవర నుండి మూడవ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టు న్యూస్ వస్తోంది. రాబోయే ఈ మూడవ సాంగ్ ఎన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.
#DevaraSecondSingle is in a league of its own 😍🔥
With over 500K+ Reels and trending on Instagram 💥💥https://t.co/WoAQqjRA87
An @AnirudhOfficial Musical 🎶 #Devara #DevaraOnSep27th pic.twitter.com/LtLJ2zmOpi
— Devara (@DevaraMovie) August 20, 2024