Leading News Portal in Telugu

Tollywood: టాలీవుడ్ టుడే ఆప్ న్యూస్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే…


  • ఆయ్ టీమ్ ను అభినందించిన అల్లు అర్జున్
  • మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్న రాజవారు రాణీవారు
  • సరిపోదాసాశనివారం ప్రీరిలీజ్ ఈవెంట్ ఫిక్స్


Tollywood: టాలీవుడ్ టుడే ఆప్ న్యూస్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే…

నార్నె నితిన్ హీరోగా బన్నీ వాసు నిర్మించిన చిత్రం ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి. ఆగస్టు 15న మూడు భారీ సినిమాల మధ్య రిలీజ్ అయి ఆడియెన్స్ మౌత్ టాక్ తో ఇండిపెండెన్స్ డే విన్నర్ గా నిలిచింది ఆయ్. అయితే ఈ సినిమాలోని నటీనటులను అభినందించాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, చిన్న సినిమా పెద్ద హిట్ సాధించిందని, హ్యాట్రిక్ కొట్టాలని హీరో నితీన్ ను శుభకాంక్షలు తేలిపాడు బన్నీ. అందుకు సంబంధించి వీడియో రిలీజ్ చేసారు ఆయ్ మేకర్స్.

రాజావారు రాణీవారు చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్‌. ఆ సినిమా ప్రయాణంలో ఈ జంట ప్రేమకు బీజం పడింది. అలా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా ఈ ప్రేమ జంట ఈ నెల 22 న ఓ శుభముహూర్తాన వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారు. కిరణ్, రహస్యాల వివాహం కూర్గ్ లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో అతికొద్దీ మంది సమక్షంలో జరగనుంది.